కృష్ణా జిల్లా కలెక్టర్గా జె. నివాస్
1 min read–స్వాగతం పలికిన జేసీ, సబ్ కలెక్టర్, ఎస్పీ
పల్లెవెలుగు వెబ్, విజయవాడ : కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ గా జె. నివాస్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జిల్లా 5వ కలెక్టర్గా జె.నివాస్ నియమితులయ్యారు. మచిలీపట్నం కలెక్టరేట్ కు చేరుకున్న కలెక్టర్ జె. నివాస్ కు మొక్కలు, పుష్పగుచ్చాలతో జాయింట్ కలెక్టర్లు డా.కె.మాధవిలత, ఎల్.శివశంకర్, కె.మోహన్ కుమార్, ఎస్ ఎన్.అజయ్ కుమార్,నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ తదితరులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం.రవీంద్రనాథ్ బాబు ,అడిషనల్ ఎస్పీ మల్లిక గార్గ్, ఎన్ ఫోర్స్మెంట్ స్పెషల్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందా, కలెక్టర్ జె. నివాస్ కు పుష్పగుచ్చలు అందజేసి అభినందనలు తెలిపారు. వీరి వెంట డిఆర్వో యం.వెంకటేశ్వరరావు, బందరు ఆర్డీవో ఖాజావలి తదితరులు ఉన్నారు.