ఇంటర్ లో కృష్ణా ఫస్ట్.. కడప లాస్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రెండు సంవత్సరాల జనరల్, ఒకేషనల్ కోర్సుల ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://examresults.ap.nic.in www.bie.ap.gov.inవెబ్‌సైట్లలో చూసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. మే 6 నుంచి జూన్ 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,69,059 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఒకేషనల్‌లో 79 వేల 22 మంది పరీక్ష రాశారు. ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 54 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం.. బాలికలు 65 శాతం ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 59 శాతం.. బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా 72 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలువగా.. ఉమ్మడి కడప జిల్లా 50 శాతం ఉత్తీర్ణతతో లాస్ట్‌లో నిలిచింది.