ప్రముఖ రచయిత్రి పోపూరి లలిత కుమారికి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం
1 min read
నేడు ప్రముఖుల సమక్షంలో పురస్కారం అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని 2024 సంవత్సరానికి ప్రముఖ రచయిత్రి పోపూరి లలితా కుమారి (ఓల్గా) కు ప్రధానం చేయనున్నట్లు గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహన్ గుప్తా ప్రకటించారు. ఫిబ్రవరి 16న ఏలూరు వై ఎం హెచ్ ఏ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో ఈ పురస్కారం అందజేస్తామన్నారు. ముఖ్యఅతిథిగా గోకరాజు గంగరాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తదితరులు హాజరు కానున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.