PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీ’ లను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కమిటీ కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల హంద్రీ నీవా ఎత్తిపోతల పథకం, పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల అమలు తీరును సోమవారం పరిశీలించారు. కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ సర్కారు జీవో జారీ చేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

హంద్రీ నీవా ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకమును కృష్ణానది యాజమాన్యం బోర్డు , సెంట్రల్ జలశక్తి బోర్డు సెక్రటరీ, తుంగభద్రా నది నీటి యాజమాన్య బోర్డు చైర్మన్ దివాకర్ రాయ్ పూరే, చీఫ్ ఇంజనీరు శివ రాజన్, కె ఆర్ ఏం బి సభ్యులు రాజ్ కుమార్ పిళ్ళై పరిశీలించారు. ఎత్తిపోతల పథకాల అమలు తీరు పై అధికారులను ఆరా తీశారు. పంపింగ్ మోటార్ లను, పంపులను, కాలువను పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు అంతర్రాష్ట్ర జల వనరుల శాఖ ప్రధాన ఇంజనీరు శ్రీనివాసరెడ్డి, హంద్రీనీవా చీఫ్ ఇంజనీరు నాగరాజు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఉన్నారు.

About Author