మోదీ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత.. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత.. పరిశ్రమలకు కరెంట్ కొరత.. యువతకు ఉద్యోగాల కొరత.. గ్రామాల్లో ఉపాధి కొరత.. రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. వంటివన్నీ ఉన్నాయన్నారు. అయితే అన్ని సమస్యలకూ మూలం పీఎం మోదీకి విజన్ కొరత కావడమే’ అని కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.