NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేటీఆర్ ను ఉరితీయాలి..

1 min read

– మ‌ల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు
వ‌రంగ‌ల్: మం త్రి క‌ల్వకుంట్ల తార‌క‌రామారావును హ‌న్మకొండ చౌర‌స్తాలో ఉరితీయాలంటూ తీన్మార్ మ‌ల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం రాలేద‌న్న మ‌న‌స్థాపంతో ఆత్మహ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డ విద్యార్థి సునీల్ ను స్థానిక ఎంజీఎమ్ ఆస్పత్రిలో పరామ‌ర్శించారు. తెలంగాణ వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పి మోసం చేసిన కేసీఆర్, కేటీఆర్ లో ఉద్యోగాలు ఊడ‌గొట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. విద్యార్థి సునీల్ కు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగం రాలేద‌న్న మ‌న‌స్థాపంతో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు చెందిన సునీల్ .. కాకతీయ యూనివ‌ర్శిటీలో పురుగుల మందు తాగి ఆత్మహ‌త్యయ‌త్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు వెంట‌నే సునీల్ ను ఎంజీఎం ఆస్పత్రికి త‌ర‌లించారు.

About Author