PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేటీఆర్ వాట్సాప్ నిలిచిపోయింద‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వాట్సాప్‌ అకౌంట్‌ నిలిచిపోయింది. సోమవారం ఒక్కరోజే ఆయన వాట్సాప్‌ నెంబర్‌కు 8వేలకు పైగా మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ‘స్పామ్‌’ పేరుతో ఆయన ఖాతాను సంస్థ బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తన వాట్సాప్‌ ఖాతా 24 గంటల నుంచి పనిచేయడం లేదని తెలిపారు. ఈ నెల 23న కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రమాదవశాత్తు పడిపోయారు. ఆయన ఎడమకాలికి గాయమైంది. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో అభిమానులు, పార్టీ నేతలు ఆయనకు మెసేజ్‌ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సందేశాలు వెల్లువెత్తడంతో అకౌంట్‌ నిలిచిపోయింది.

                                        

About Author