మునుగోడు గెలుపు పై కేటీఆర్ సంచలన ప్రకటన !
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని సదరు ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని ఆయన వివరించారు.