ఓటీటీలో మంచి సినిమా పేరు చెప్పాలంటూ కేటీఆర్ ట్వీట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. కొంతకాలంగా కేటీఆర్ కాలుకు నొప్పి వస్తోంది. దాంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శస్త్ర చికిత్స చేయించుకోవాలని డాక్టర్ సూచించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కాలుకు కట్టు ఉండటం వల్ల మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తన కాలుకు శస్త్ర చికిత్స జరిగిందని.. మూడు వారాల పాటు ఖాళీగా ఉన్నందున ఓటీటీలో మంచి సినిమా ఉంటే సలహా ఇవ్వాలని నెటిజన్లను ఆయన కోరారు.