మరియతల్లి ఊరేగింపులో కుంభ వర్షం
1 min readతిరు కుటుంబ మండపాన్ని ప్రారంభించిన గురువులు
-భక్తి శ్రద్ధల నడుమ 10 గ్రామాల ప్రజలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పల దడియ ఆర్ సి ఎం విచారణలో మంగళవారం మరియతల్లి ఊరేగింపు 10 గ్రామాల ఆర్సియం సంగస్తులు భక్తిశ్రద్ధల నడుమ విచారణ గురువులు ఫాదర్ డి. మధు బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలమందలపాడు, ఉప్పలదడియ,మాసపేట, కడుమూరు,పైపాలెం,49 బన్నూరు,చౌటుకూరు, దేవనూరు,కేతవరం ఈ గ్రామాల నుండి ప్రజలు ఉదయం నుండి వివిధ గ్రామాల నుంచి మరయ తల్లి స్వరూపములతో వర్షాన్ని కుమ్మరించాలని ఉప్పలదడియ దేవాలయమునకు హంగు ఆర్భాటాలతో జపమాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో సాయంత్రం 6 గంటలకు అక్కడికి చేరుకున్నారు.ఉప్పల దడియలో ఊరేగింపుగా మేల తాళాలతో టపాకాయలు కాలుస్తూ వెళుతున్న సమయంలోనే వర్షం పడడంతో ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ హంగామా చేశారు. ఊరేగింపు అనంతరం విచారణ గురువులు మరియు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన తిరు కుటుంబ మండపం(మరియ తల్లి,పు నీత జోజప్ప,బాల యేసు స్వరూపాల)మండపాన్ని వెంకాయపల్లి విచారణ గురువులు ఫాదర్ రాజేంద్ర మరియు ఫాదర్ మధుబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అక్కడే 51 టెంకాయలను సమర్పించారు. తర్వాత ఫాదర్ రాజేంద్ర దివ్య బల్లి పూజను సమర్పిస్తూ వాక్య పరిచర్య చేశారు. విచారణ గురువులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.అనంతరం వచ్చిన వారందరికీ భోజన వసతిని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బ్రదర్ థోమాస్, సిస్టర్ ఎం.థెరేసా,విచారణ పెద్దలు ఆనందరావు,భాస్కర్, పక్కిరయ్య,ఫ్రాన్సిస్,జాన్, బాలస్వామి,ఏసన్న,దాసు,హరిబాబు,డేవిడ్, సతీష్ మరియు పది గ్రామాల విశ్వాసులు పాల్గొన్నారు.