NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు.. 10 కి.మి. లారీకి వేలాడుతూ వెళ్లిన టోల్ గేట్ సిబ్బంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో ఓ టోల్‌గేట్ దగ్గర లారీ డ్రైవర్ హల్ చల్ చేశాడు. లారీని ఆపకుండా వెళ్లడంతో టోల్‌గేట్ సిబ్బంది వెంబడించారు. లారీ ముందు భాగంలో టోల్‌గేట్ ఉద్యోగి వేలాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం, అమకతాడు టోల్‌గేట్ దగ్గర రాజస్థాన్‌కు చెందిన లారీ వచ్చింది. అయితే టోల్ చార్జీ చెల్లించకుండా వెళ్లేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో అడ్డుకున్న టోల్ ప్లాజా ఉద్యోగి లారీ ముందు భాగంలో నిలబడ్డాడు. అయినా పట్టించుకోని డ్రైవర్ లారీతో అలాగే వెళ్లిపోయాడు. దాదాపు 10 కి.మీ. దూరం లారీకి వేలాడుతూనే ఉండిపోయాడు. దీంతో టోల్‌గేట్ పోలీసులకు సమాచారం అందించారు. హైవేపై పోలీసులు లారీని ఆపడంతో ఉద్యోగి కిందికి దిగి ఊపిరిపీల్చుకున్నాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

                               

About Author