PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కార్నియా’ను కాపాడిన కర్నూలు అమీలియో వైద్యులు..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రమాదవశాత్తు కంటికి గాయమైన కార్మికునికి అమీలియో కంటి వైద్యులు ఒకేసారి రెండు ఆపరేషన్లు నిర్వహించి కార్నియాను కాపాడారు. ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన 38 సం॥ల ముసలయ్యకు ప్రమాదవశాత్తు కంకర రాయి కంటికి బలంగా తగిలింది. ఈ ప్రమాదంలో కార్మికుని నల్లగుడ్డు తెగిపోయి కంటి లెన్స్ పగిలిపోయి కంటి చూపు 90% కోల్పోయారు. ఈ పరిస్థుతులలో రోగి ఈ నెల 18వ తేదిన చికిత్సకోసం అమీలియో హాస్పిటల్ను సంప్రదించారు. కార్నియా మరియు ఫాకో స్పెషలిస్ట్ డా॥ మునీరా బేగం నల్లగుడ్డు, లోపల లెన్సు ఒకే సారి దెబ్బతిన్నట్లు గుర్తించారు. అదే రోజు రోగికి తెగిపోయిన నల్లగుడ్డుకు ఆరు కుట్లు వేసి. పగిలిపోయిన కంటి శుక్లానికి లెన్సు అమర్చి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం రోగికి 100 శాతం చూపు రావడం జరిగింది. ఇలాంటి క్లిష్టమైన కేసులను పెద్దపెద్ద నగరాలలో కార్నియా స్పెషాలిటీ, లెన్స్ స్పెషాలిటీ ఉన్న వైద్యులు మాత్రమే చేస్తారని, కాని అమీలియో హాస్పిటల్ నందు నల్లగుడ్డుమీద రెండు సంవత్సరాల విశేష శిక్షణ పొందివున్న డా॥ మునీరా బేగం గారి ఆద్వర్యంలో ఈ అరుదైన కంటి శస్త్రచికిత్స సాధ్యమైంది. ఈ సందర్భంగా కార్నియా మరియు ఫాకో స్పెషలిస్ట్ డాక్టర్ మునీరా బేగం గారు మాట్లాడుతూ ” ఆపరేషన్కు ముందు ఆ రోగి 90 శాతం చూపును కోల్పోయాడని, ఆపరేషన్ అనంతరం 100 చూపు వచ్చి సంపూర్ణ కంటి చూపుతో డిశ్చార్జ్ అయారన్నారు. డబ్ల్యూహెచ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం 55 లక్షల మంది కంటికి దెబ్బతగిలి కంటిచూపు కోల్పోతున్నారన్నారు. కంటికి దెబ్బతగిలిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి డాక్టరును సంప్రదించిన యెడల చూపు పోకుండా కంటిని కాపాడొచ్చన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కార్మికులు సేఫ్టీ కంటి అద్దాలు దరించవలసిందిగా కోరారు.

About Author