కర్నూలు.. సచివాలయం ఉద్యోగి పై దాడి !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా నంద్యాలలోని 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కుమారుడు రెచ్చిపోయాడు. సచివాలయం ఉద్యోగిపై దాడి చేశాడు. తాను చెప్పినట్లు ఎందుకు చెయ్యవంటూ ఉద్యోగి వెంకట సుధాకర్‌పై బండ బూతులతో చెలరేగిపోయాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటనలో సుధాకర్‌కు గాయాలయ్యాయి. శివకుమార్ దాడిని ఖండిస్తూ సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శివకుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.