కర్నూలు.. ముళ్లపొదల్లో పసికందు
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలో కళ్ళు కూడా పూర్తిగా తెరవని ఓ పసికందుని ముళ్ళ పొదల్లొ వదిలేసి వెళ్లారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అంతగా లేనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా కనిపిస్తోంది. నిరక్షరాస్యత, కుటుంబ, ఆర్థిక పరిస్థితులు, ఆడ పిల్లలను పెంచడం భారమనో, కొడుకు పుట్టలేదనో.. కారణం ఏదైనప్పటికీ పలు ఘోరాలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు రోడ్డు పక్కన పొదల్లో విలవిల్లాడుతూ కనిపించింది. అప్పుడే పుట్టిన ఆడపిల్లను గుర్తి తెలియని వ్యక్తులు ముళ్ళ పొదల్లో పడేసి వెళ్లిపోయారు.