PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. వాగులో కొట్టుకుపోయిన కారు ల‌భ్యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఆలూరు మండలం, కల్లివంక వాగులో కొట్టుకుపోయిన కారు లభ్యమైంది. అందులో ఉన్న వ్యక్తి సురక్షితంగా ఉన్నారు. ఆదివారం రాత్రి వరద ఉధృతికి కల్లివంక వాగులో కారు కొట్టుకుపోయింది. గుంతకల్లు నుంచి ఆలూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరదను గుర్తించకుండా కర్నాటకు చెందిన వ్యక్తి జావిద్ అన్సారీ కారుతో వెళ్లారు. స్థానికులు చూస్తుండగానే కారు వరద ధాటికి కొట్టుకుపోయింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో కొట్టుకుపోయిన కారు నాలుగు కి.మీ. దూరంలో ఉండటాన్ని గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తి కొంచెం దూరంలో ఒడ్డుపై సురక్షితంగా ఉండడాన్ని రిస్క్యూ సిబ్బంది గమనించారు.

                                   

About Author