NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ వసతిగృహలపై కర్నూలు కలెక్టర్​ సమీక్ష!

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: జిల్లా కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాల్​లో శుక్రవారం కలెక్టర్​ పి.కోటేశ్వరరావు సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల్లో నైతికతను పెంపొందిందచే అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కార్య్రకమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల జిల్లా అధికారులు, ఏఎస్​డబ్ల్యూవో, ఏబిసిడబ్ల్యువో, ఏటిడబ్ల్యూవోలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో పేద విద్యార్థుల పట్ల ప్రేమ, అనురాగం, ఆప్యాయత చూపాలన్నారు. మంచి వసతులతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన భోజనం మెనూను తప్పక అమలు చేయాలని ఆదేశించారు. సమాజానికి పనికి వచ్చేలా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఆప్యాయతతో పలకరిస్తూ మంచి విలువలు నేర్పాలన్నారు. ఇంటి కన్నా హాస్టల్ బాగుందన్న భావన కలిగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల పరిధుల్లోని సంక్షేమ వసతి గృహాలలో ఎంత మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు..? వంటి వివరాలను సోషల్ వెల్ఫేర్ డిడి కలెక్టర్​కు వివరించారు.

About Author