NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నికి ఆహుతైన కర్నూలు సీపీఎం కార్యాలయం !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్నూలు నగరంలోని స్థానిక 32వ వార్డ్, ముజఫర్ నగర్ ‌లో గల సీపీఎం కార్యాలయం అగ్నికి ఆహుతి అవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. గత 30 సంవత్సరాలుగా వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, ఉద్యమ నిర్మాణానికి కేంద్రంగా వున్న సీపీఎం కార్యాలయం గత సోమవారం అర్ధరాత్రి 11.00 గంటల సమయంలో అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా స్వార్థపరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది మిస్టరీగా మారింది. దింటిపై పోలీసులు విచారణ జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ కోరారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పియస్ రాధాకృష్ణ, పి నిర్మల, మరియు ఇతర సిపిఎం నేతలు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

About Author