PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు.. వైసీపీలో భ‌గ్గుమ‌న్న విబేధాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో వైసీపీ వ‌ర్గ విబేధాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. క‌ర్నూలు జిల్లాలోని గార్గేపురంలో ఎమ్మెల్యే సుధాకర్, ఇంచార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య గతరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఊర్లో ఓ ఫంక్షన్ విషయంలో వైసీపీ వర్గం ప్రశాంత్ కుటుంబంపై వినయ్ రెడ్డి వర్గం చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీలు… రాత్రి వినయ్ రెడ్డి ఇంటిపై రాళ్లు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో కారు, ట్రాక్టర్, ఇంటి సామగ్రి ధ్వంసం అవ్వ‌గా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రెండు వర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

                                     

About Author