కర్నూలు జిల్లా చిన్నారులకు‘ నేషనల్ ప్రీమియర్ మల్టీ టాలెంటెడ్ కిడ్’ అవార్డు
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన లాక్డౌన్ సమయంలో నిర్వహించిన సాంప్రదాయ వస్త్రధారణ, సాండ్ ఆర్ట్, డ్రాయింగ్ వంటి విభాగాల్లో కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన వరలక్ష్మి, శ్రీహరి దంపతుల కూతురు, కుమారుడు అత్యున్నత ప్రతిభ కనబరిచినట్లు నేషనల్ ప్రీమియర్ అవార్డు సంస్థ వ్యవస్థాపకులు రవి శ్రీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు మాంటిస్సోరి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి హితస్వన, 3వ తరగతి చదువుతున్న చతురాస్య విశేష ప్రతిభ కనబరిచినందుకు ‘ నేషనల్ ప్రీమియర్ మల్టీ టాలెంటెడ్ కిడ్ ’అవార్డుకు ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ చిన్నారులు చదువుతోపాటు కర్ణాటక సంగీతం ముకాభినయం, డ్రాయింగ్ ,ఏకపాత్రాభినయం, భగవద్గీత శ్లోకాలు వంటి విభాగాల్లో విభిన్న ప్రతిభ కనబరుస్తున్నారు. తమ పిల్లలు మల్టీ టాలెంటెడ్ కిడ్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు వరలక్ష్మి, శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు.