కర్నూల్ జిల్లా డాక్టర్ వింగ్ అధ్యక్షులుగా యాదవ శ్రీ కృష్ణ మూర్తి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నూతనంగా కర్నూల్ జిల్లా డాక్టర్ వింగ్ అధ్యక్షులుగా యాదవ శ్రీ కృష్ణ మూర్తి గారిని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నియమించారు. అనంతరం ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ సాయి కృష్ణ ఐ హాస్పిటల్ అధినేత అయినటువంటి శ్రీ కృష్ణ మూర్తి యాదవ్ గారిని జిల్లా డాక్టర్ వింగ్ అధ్యక్షునిగా చేస్తూ ఆయన గతంలో నిరుపేదలకు నామమాత్రపు ఫీజు తీసుకుంటూ చాలామంది పేదలకి కంటి సేవలు చేసినాడు ఇటువంటి వ్యక్తులను మన ప్రోత్సహించి ముందుకు పంపిస్తే తమ సామాజిక వర్గానికి న్యాయం చేసి పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్నారు అనంతరం శ్రీ కృష్ణ మూర్తి గారు మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి డాక్టర్ వింగ్ అధ్యక్షులుగా జిల్లాకు చేసినందుకు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారికి ధన్యవాదాలు నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్ప చెప్పినందుకు పార్టీకి కష్టపడి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తానని నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా మురళి రెడ్డి ఇదియాత్ కామాక్షి తిమ్మప్ప మూర్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.