ఆగష్టు 27న కర్నూలు జిల్లా మాతృశక్తి సమ్మేళనం
1 min read– రాష్ట్ర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశంలో హిందూ మహిళలపై జరుగుతున్న అనేక అకృత్యాలను ప్రశ్నించడం కోసం, హిందూ మహిళల సంఘటన, ఏకమవ్వడం వంటి విషయాలను మాతృశక్తి, దుర్గావాహిని విభాగాలలో కార్యకర్తలను విస్తరించడం కోసం…. విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా మాతృశక్తి ఆధ్వర్యంలో ఈనెల ” ఆగష్టు 27 2023 తేదీన రెవెన్యూ కాలనీ లోని భరతమాత ఆలయ ప్రాంగణంలో ” మాతృశక్తి సమ్మేళం” జరుపబతుందని ఈ రోజు ఉదయం 10:30 కు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథి గా విచ్చేసి రాష్ట్ర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి గౌరి అన్నారు. జిల్లా మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి రాధిక మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందూ స్త్రీలు మరియూ యువతుల భాగస్వామ్యం తో పెద్ద ఎత్తున ఈ సమ్మేళనము నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.నగర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి మాట్లాడుతూ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో మహిళా ఉన్నత విద్యావంతులు పాల్గొంటారని ప్రధాన వక్త గా శ్రీమతి రమాదేవి (రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మావతి విశ్వవిద్యాలయం) ,తిరుపతి. వారు మార్గదర్శనం చేస్తారని, ఈ కార్యక్రమం ఉదయం 10:30 గం.ల నుండి మధ్యాహ్నం 1:30 వరకు కార్యక్రమం ఉంటుందని భోజనం తో కార్యక్రమం పరిసమాప్తి అవుతుందని నగరం నుండి, జిల్లా నుండి అధిక సంఖ్యలో మాతృమూర్తులు,యువతులు పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ” కరపత్రాన్ని ” విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా దుర్గా వాహిని కన్వీనర్ శ్రీమతి లక్ష్మి , ప్రఖంఢ కార్యకర్తలు శ్రీమతి రాధ,శ్రీమతి శిరీష,శ్రీమతి రామతులసి,శ్రీమతి అరుణ, శ్రీమతి నాగలక్ష్మి ,శ్రీమతి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.