సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానం
1 min read
జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటు
ఈ ఏడాది 8500 ఫారం పాండ్స్, 300 పశువుల తొట్టెల నిర్మాణానికి చర్యలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు బాగా జరిగిందని, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వెల్లడించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 సంవత్సరంలో సాధించిన ప్రగతి గురించి కలెక్టర్ వివరిస్తూ2.14 లక్షల కుటుంబాలకు 89 లక్షల పనిదినాలు కల్పించి రూ.250 కోట్ల వేతనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.మెటీరియల్ పేమెంట్ క్రింద రూ.144.50 కోట్ల ఖర్చుతో సి.సి రోడ్లు, గోకులాలు, పారం ఫాండ్స్, ప్లాంటేషన్ తదితర పనులను చేపట్టడం జరిగిందన్నారు.రూ.78 కోట్లతో సుమారు 119.72 కిలోమీటర్ల మేరకు రహదారులు నిర్మించి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలించిందన్నారు.కూలీలకు రోజు వేతనం సగటున రూ. 286/- రూపాయలు కల్పించి, కర్నూలు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందన్నారు.కుంటలు, చెరువులలో పూడిక తీత పునరుద్ధరణకు సంబంధించి 1496 పనులు చేపట్టి 149.60 కోట్ల లీటర్ల నీటిని భూమిలోకి ఇంకింపజేసి రూ.17.03 కోట్లను కూలీలకు వేతనాలుగా చెల్లించడం జరిగిందన్నారు.SC ST చిన్న/సన్నకారు రైతుల పొలాల్లో 981 పంట కుంటలు నిర్మించి రూ.11.77 కోట్లను వేతనాల రూపంలో కూలీలకు చెల్లించడం జరిగిందన్నారు.సుమారు 6273 కిలోమీటర్ల మేరకు కాలువల్లో పూడిక తీసి తద్వారా రూ. 92.91 కోట్లను వేతనాల రూపంలో కూలీలకు చెల్లించడం జరిగిందన్నారు.పశువులకు సుమారు 751 గోకులాలను నిర్మించి రూ.11.50 కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు.రూ.5.86 కోట్ల ఖర్చుతో 2186 రైతుల పొలాలలో 3774 ఎకరాలలో మామిడి, బత్తాయి, సపోటా, మునగ, నిమ్మ తదితర పండ్ల తోటల పెంపకం చేపట్టడం జరిగిందన్నారు.2025-26 సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల వివరాలురాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచ ప్రాధాన్యత లో భాగంగా రాబోయే 3 మాసాలకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.కోటి రూపాయలతో 300 పశువుల తొట్టెల నిర్మాణాలను ఏప్రిల్ 10 వ తేది లోపల పూర్తి చేయడం జరుగుతుందన్నారు.రూ.54 కోట్లతో, 12 లక్షల పనిదినాలు కల్పించి 8500 సేద్యపు నీటి కుంటలు/ పంట సంజీవిని పనులు మే 31వ తేది లోపల పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు.138 చెరువులు/కుంటలు పూడికతీత, పునరుద్ధరణ పనులు, సుమారు 3000 కిలోమీటర్ల మేరకు కాలువల్లో పూడిక తీత పనులకు రాబోవు 3 మాసాలకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.కూలీలకు రోజు వేతనం సగటున 307/- రూపాయలు నిర్దేశించి, రాబోవు సంవత్సరంలో 300 కోట్ల రూపాయలు వేతన రూపంలో ఖర్చు చేయడానికి లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
