PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హోళగుంద మండలంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రైతు సంఘం నాయకుడు తిమ్మయ్య సిపిఐ హోళగుంద మండల కార్యదర్శి మారెప్ప మాట్లాడుతూకర్నూలు జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేపట్టాలి పంట నష్టపరిహారం డబ్బులు ఇవ్వాలి 2023 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పత్తి పంటకు ఎకరాకి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కంది వేరుశనగ జొన్న టమోటా పంటలకు ఎకరాకు 30000 రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని బుల్లి మిర్చి పంటకు ఎకరానికి లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ఖరీఫ్లో తీసుకున్న క్రాఫ్ లోన్స్ పంట రుణ రుణాలు మాఫీ చేయాలని ఇన్సూరెన్స్ 100% వర్తింప చేసే విధంగా గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలి రబీకి సెనగ పంటకు సబ్సిడీ 90% విత్తనాలు ఇవ్వాలని రైతులకు రెండు లక్షల వరకు పాత రుణాలు మాఫీ చేయాలి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయనంలో అనుసంధానం చేయాలని 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు 15000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వలస నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు జిల్లాలో అన్ని మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి ఇంత జరుగుతున్న అధికారులు గాని అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకోవడం లేదు ఒకరిపై ఒకరు రాజకీయాలు విమర్శలు చేసుకోవడం ప్రధాన రాజకీయ పక్షాలు బిజీగా ఉన్నాయి జిల్లా అధికారులు వ్యవసాయ అధికారులు తక్షణమే కరువును అంచనా వేయాలి పంట నష్టం నమోదు చేయాలి జిల్లాలో కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ లేకపోవడంతో అటెండర్ ఆనంద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తాసిల్దార్ బాగానే మీ అంత పత్రం అందజేయాలని కోరడం జరిగింది  ఈ కార్యక్రమం లో మండల సహాయ కార్యదర్శి రంగన్న  రైతు సంఘం సంగం మండల కార్యదర్శి కృsష్ణయ్య  సలాం సాబ్ హినాహిత్ మస్తాన్ కార్లింగ వలి మహిళా సంఘం నాయకులు భూలక్ష్మి బసమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author