కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.. సిపిఐ డిమాండ్
1 min read– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఐ బహిరంగ లేక
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద మండల కేంద్రం నందు స్థానిక బస్టాండ్ లో కర్నూలు జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించాలని. సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప మాట్లాడుతూ కర్నూలు జిల్లా భజన జరిగిన తర్వాత రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుగాంచింది జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఆదోని పత్తికొండ ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం కోడుమూరు కరువు కాటకాలకు మారాయి కరువు విలయ తాండం చేస్తున్నది ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటి సైతం దొరకక అలమటిస్తున్నారు ఈ ప్రాంతంలో బిల్డింగ్ లో ఉన్నటువంటి సాగునీరు ప్రాజెక్టు వేదవతి ఆర్డిఎస్ కుడి కాలువ గుండ్రేవుల ప్రాజెక్టును హంద్రీనీవా స్థిరీకరన పనులను పూర్తిచేసే లక్షలాది ఎకరాలకు సాగునీరు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు త్రాగునీరు దొరుకుతుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగలేదు. దీని కారణంగా పశ్చిమ ప్రాంతం మరింత వెనుకబాటుకి గురవుతుంది పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రజల పనులు లేక సదురు ప్రాంతాలకు వలసపోయి దుర్భార జీవితం గడుపుతున్నారు దేశంలో ఉన్న పేదరికమంతా ఎక్కడ కనబడుతుంది కావున తక్షణమే ఈ ప్రాజెక్టులను నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని పశ్చిమ ప్రాంతంలో ఉన్న కరువును రూపుమాభి ప్రాంతాన్ని చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని వారు డిమాండ్ చేశారు.
డిమాండ్స్
1.జిల్లా అభివృద్ధికై పదివేల కోట్లను నిధులు కేటాయించాలి.
2.ఉల్లి మిర్చి ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి
3.పత్తి వేరుశనగ కంది జొన్న సజ్జ కుర్ర ఆముదముకు తదితల పంటలకు 40 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి.
4.రైతుల బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలి.
5.రవి సీజన్లో పంటలు వేయడానికి 90% సబ్సిడీతో రైతన్నలకు విత్తనాలు పంపిణీ చేయాలి.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రంగన్న రైతు సంఘం నాయకుడు కృష్ణ సిపిఐ ఏఐటియుసి నాయకులు భాష గాది లింగ జయరాం రెడ్డి వెంకటేష్ శాష తదితరులు పాల్గొన్నారు.