NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూల్ హోటల్ అసోసియేషన్ సమావేశం

1 min read

– ప్రభుత్వం వారికి సెల్ టాక్స్ ఆదాయము టాక్స్ మున్సిపాలిటీకి చెత్త పన్ను మున్సిపాలిటీలకు పన్నులు కడుతూ
వస్తున్నాం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ మధ్యకాలంలో నకిలీ అధికారులు మేము ప్రభుత్వం తరఫున అధికారం గా వచ్చామని చెబుతూ చిన్నచిన్న హోటల్ ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఒకడేమో ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఇంకొకడు సేల్ టాక్స్ ఆఫీసర్ నాని ఇంకొకరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామనిఇంకా కొంతమంది ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాముమీ దగ్గర పుట్టుకు సంబంధించిన పేపర్లు ఏమీ లేవు కాబట్టి మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాం అని బెదిరించడమే కాక చాలా అవమానంగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా నకిలీ అధికారులకు భయపడాల్సిన అవసరం లేదుఎవరైనా మీ దగ్గరికి నకిలీ అధికారులు వస్తే మర్యాద చేసి కూర్చోబెట్టి అసోసియేషన్ వాళ్లకు ఫోన్ చేస్తే వచ్చి వారితో మేముసంప్రదింపులు జరుపుతాం పత్రికా ముఖం ద్వారా తెలియజేయడమేమనగ. ఎవరైనా సరే హోటల్స్ యజమానుల జోలికి వస్తే వారికి తగిన గుణపాఠం చెప్పి పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పబడును ఖబర్దార్ స్వచ్ఛంగా నీతిగా న్యాయంగా మనం చేసుకుంటున్న వ్యాపారాన్ని చిన్నచిన్న టిఫిన్ సెంటర్లుమరియు మెస్సులు సంబంధించిన వాటిని ఎవరిని అవహేళనగా మాట్లాడితేవారి మీద చట్టబద్ధంగా చర్య తీసుకుంటాం, మాత అన్నపూర్ణేశ్వరి అమ్మని నమ్ముకుని బతికే వాళ్లకు కూడా నకిలీ అధికారుల బాధలు తప్పడం లేదు ప్రతి సంవత్సరము మజ్జిగ వితరణ చేస్తాం కాబట్టి60 రోజులు ఏ కదాటిగా ప్రతిరోజు 5000 మంది వరకుమజ్జిగ వితరణ జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్లకుకలెక్టర్ ఆఫీస్ కు వచ్చే వాళ్లకు ప్రజలకు అందరికీ మజ్జిగ వితరణ ఉచితంగా చేయబడును శ్రీరామనవమి రోజు పానకము ప్రసాదము కూడా వితరణ జరగబోతుంది. కావున నకిలీ ఆఫీసర్ నుంచి మమ్మల్ని కాపాడాలని ఈ వారం లోపల కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు నిర్ణయించినారు. ఈ సమావేశంలో కర్నూల్ హోటల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావుమరియు అధ్యక్షులు కల్కురా మురళి కార్యదర్శి గోపి హోటల్ అధినేత పువ్వాడి రామకృష్ణ, కోశాధికారి అమరావతి హోటల్ వినయ్, ఉపాధ్యక్షులు రమా హోటల్ యజమాని వెంకటేష్,అజంతా హోటల్ కిరణ్,సహాయ కార్యదర్శి కల్కి మురళి బృందావన హోటల్ శ్రీధర్ మరియు ఈసీ మెంబర్లు,గీతా లంచ్ హోమ్. గీతా విశ్వనాధ్ గీత రాఘవేంద్ర పాల్గొన్నారు. అనికర్నూలు జిల్లా హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి, హోటల్ పంజాబీ దాబా విజయ్ తిరుపతి రెడ్డి , తులిపారు.

About Author