కర్నూలు…ఐఐఐటీడీమ్ ఐదవ స్నాతకోత్సవం
1 min read– శనివారం, 23 సెప్టెంబర్ 2023 న ఘనంగా నిర్వహించారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రస్తుత IIT హైదరాబాద్ చైర్మన్ మరియు Cyient సంస్థ వ్యవస్థాపకులు, ఇంజనీరింగ్ రంగ నిపుణులైన డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మన దేశ అభివృద్ధికి నూతన ఇండస్ట్రీ 4.0 ఎదుగుదలకి భావితరాలే మైలు రాయి అని విద్యార్థులను ప్రోత్సహించారు. ఐఐటిడిఎం నీ స్థాపించిన 9 సంవత్సరాల సమయంలోనే ఎంతగానో అభివృద్ధి చెందింది అని, సమాచార సాంకేతిక రంగాలలోనే కాకుండా డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోనూ అందరికంటే ముందడుగు వేయడం గర్వపడే విషయమని తెలిపారు. గౌరవనీయ డైరెక్టర్, ప్రొఫెసర్ డి వి ఎల్ ఎన్ సోమయాజులు, 2022-2023 విద్యా సంవత్సరానికి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం లో ఇన్స్టిట్యూట్ యొక్కప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. IITDM కర్నూల్లోని కోర్సులు మరియు పాఠ్యాంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, IoT, క్వాంటం కంప్యూటింగ్, డిజైన్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ మొదలైన ఇంజనీరింగ్ మరియు సైన్స్లలో సంబంధిత పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తాయి.ఇన్స్టిట్యూట్ యొక్క వివిధ కోర్సులలో ఈ సంవత్సరం ఉత్తీర్ణులైన 117 మంది బి. టెక్ మరియు ఒక ఎం. టెక్. విద్యార్థులందరికీ ఈ స్నాతకోత్సవం లో డిగ్రీలు ప్రదానం చేయబడ్డాయి.బి. టెక్ సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లలో టాపర్స్‌గా నిలిచిన కె సాయి దీపిక లహరి, ఎస్ ప్రవళిక, హర్ష తేజ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసారు. అన్నీ విభాగాలలో ఓవరాల్టాపర్ గా నిలిచిన విద్యార్థిని కె సాయి దీపిక లహరికి కూడా బంగారు పతకం అందజేసారు.CSE డిపార్ట్‌మెంట్‌లో అతుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని కె సాయి దీపిక లహరికి దుర్వాసుల మాణిక్యాంబ స్మారక బంగారు పతకం బహుకరించారు.