మతసామరస్యానికి ప్రతీక కర్నూలు
1 min read– పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి
– కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం. శ్రీహర్ష
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మతసామరస్యానికి ప్రతీక కర్నూలు అని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం. శ్రీహర్ష అన్నారు. గురువారం స్థానిక అశోక్ నగర్ లోని మోడరన్ కాంప్లెక్స్ లో నాగరాజు డాన్స్ అకాడెమీ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నగరంలోని పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం. శ్రీహర్ష హాజరై 200 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్బంగా శ్రీహర్ష మాట్లాడుతూ ప్రవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ఖురాన్ పఠనం చేస్తూ, పేదలకు దాన ధర్మాలు చేస్తూ అల్లాహ్ ను ప్రార్థిస్తుంటారని అన్నారు. ఈ మాసంలో కర్నూలు నగరంలోని పేద నిస్సహాయులైన ముస్లిం సోదరులు వారి కుటుంబ కూడా ఆనందంతో రంజాన్ పండుగను చేసుకునే విధంగా నేడు ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నాగరాజు మిత్ర బృందం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. కర్నూలు ప్రగతి సమితి కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే కర్నూలు ప్రజలు కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకుంటూ కర్నూలు ప్రాంత అభివృద్ధిలో కర్నూలు ప్రగతి సమితితో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.శ్రీనివాస్, హరినాథ్ గౌడ్, చాంద్, నాగరాజు, భార్గవ్, ప్రేమ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.