జాతీయస్థాయి క్రీడా పోటీల కేంద్రంగా కర్నూలు
1 min read– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు,వెబ్ కర్నూలు: జాతీయస్థాయి క్రీడా పోటీలను తరచుగా కర్నూల్ లో నిర్వహించడం వల్ల, జాతీయ స్థాయి క్రీడలకు కర్నూలు కేంద్రంగా మారడం గర్వించదగ్గ విషయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. డిసెంబర్ 4వ తేదీన నగరంలో జరగనున్న దక్షిణ భారత దేశ స్థాయి కరాటే పోటీల పోస్టర్ను ఈరోజు తన చాంబర్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి క్రీడాకారుల ప్రోత్సానికి తాను ముందు ఉంటానని అన్నారు. క్రీడాకారుల సంక్షేమం కోసం టీజివి స్పోర్ట్స్ ట్రస్టు ద్వారా క్రీడాకారులను సహకారం అందిస్తున్నామన్నారు. ఏబీ కరాటే అకాడమీ ఇంచార్జ్, పోటీల నిర్వాహక కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన నందికొట్కూరు రోడ్డులోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు ఐదు రాష్ట్రాల నుండి 300 మంది పైగా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు.