కేంద్ర మంత్రిని మర్యదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎంపీ
1 min read
ఢిల్లీ, న్యూస్ నేడు: కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ఎస్.పి సింగ్ బఘేల్ ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు మరియు సభ్యులు తో కలిసి ఆయనను కలిసిన ఎం.పి నాగరాజు , బఘేల్ నిశాలువతో సన్మానించి, భక్త కనకదాసు చిత్ర పటాన్ని అందజేశారు. అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో గొర్రెల కాపరులు ఎదురుకొంటున్న సమస్యల పై చర్చించి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గ మరియు జిల్లా కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు.

