కర్నూలు.. పట్టపగలే చోరీ !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. స్థానిక మునెప్ప నగర్లో నివాసం ఉంటున్న మహేశ్వరరెడ్డి బుధవారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లికి వెళ్లాడు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు చప్పుడు కాకుండా ఇంటి కాంపౌండులోకి దూకి గ్రిల్ తొలగించి ఇట్లోకి దూరి బీరువాలో దాచిన రూ. 15లక్షల నగదు, 10 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. మధ్యాహ్నం పక్కింటివారికి అనుమానం వచ్చి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని ఇంట్లో చూడగా బీరు వా తెరిచి ఉండటం, బీరువాలో నగదు, నగలు దోపిడీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటిని పరిశీలించారు. యజమానితో వివరాలు తెలుసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.