‘కర్నూలు’ను దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలి
1 min readకాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు
పల్లెవెలుగు వెబ్:కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు. శనివారం పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం పెద్దపాడులో కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్ హనుమంత రావు, మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి దామోదరం సంజీవయ్య విశేష కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కర్నూలును దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాణ్యం నియోజకవర్గ NSUIరాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్, అశోక రత్నం చింతల మోహన్ రావు, పుల్లయ్య, వివిధ ప్రజాసంఘాల నాయకులు, Nsuiకర్నూలు జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్ ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.