NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలి…

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కర్నూలు నగరంలో మున్సిఫ్ కోర్ట్ దగ్గర,అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి కర్నూలు జిల్లా – ఆంధ్ర ప్రదేశ్ ఆద్వర్యంలో అధికార వికేంద్రీకరణ – మూడు రాజధానుల ఏర్పాటు మరియు”కర్నూలును ఖచ్చితంగా న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్”,అనేఅంశంకై ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీల వైఖరిపైరౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, నగర మేయర్ బివై రామయ్య గారు,పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు త్యాగాలకు ప్రతీక ఆనాటి నుండి నేటి వరకు రాయలసీమ ప్రజలు రాయలసీమ వనరులు అందరూ అనుభవిస్తున్నారు కానీ రాయలసీమలో మాత్రం కరువు కాటకాలు వలసలు ఎక్కువగా ఉన్నాయి గత ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆస్తులను పెంపొందించేందుకు ఒక రియల్ ఎస్టేట్ రాజధాని నిర్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని, దీని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పరిపాలనవి కేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగా కర్నూలుకు రాజధాని ప్రకటించడం జరిగింది కానీ దీనిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటు రాయలసీమ ప్రజల ఓట్లతోనే గతంలో అధికారాన్ని అనుభవించారని అది మర్చి పోయి నేడు నాయకులు ప్రవర్తించడం రాయలసీమ ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా భవిష్యత్తులో టిడిపి జనసేన బీజేపీ పార్టీలకు రాయలసీమ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అదేవిధంగా న్యాయ రాజధాని ఉద్యమం రాయలసీమ ప్రజల బాధ్యత న్యాయవాదులు మేధావులు యువకులు ఈ ఉద్యమాన్ని నీరు కార్చకుండా అందరూ కలిసి సాధించుకోవాలని దీనికొరకు నా ఒక్క నెల జీతం రెండు లక్షల 90000 ఉద్యమ నిధి కి ఇస్తున్నానని ఎంపీ తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, మేధావులు, యువకులు,మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author