PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలుకు కోట్ల విజయభాస్కర్​ రెడ్డి పేరు పెట్టాలి : బిర్రు ప్రతాప రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి, పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు పెట్టాలని, అలాగే అనంతపురం జిల్లాకు కానీ నంద్యాల జిల్లాకు కానీ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పేరుపెట్టాలని ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కర్నూల్ లోని స్కంద బిజినెస్ పార్క్ లో గల వారధి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు ను, గతంలో కడప జిల్లాకు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టడాన్ని ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం స్వాగతిస్తున్నామన్నారు.  అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన  మాజీ ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా వాసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు కూడా కర్నూలు జిల్లాకు పెట్టాలని,  అలాగే మాజీ రాష్ట్రపతి  నీలం సంజీవరెడ్డి పేరును అనంతపురం జిల్లాకు కానీ నంద్యాల జిల్లా కు కాని పేరు పెట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రులను గౌరవించడం మంచి సంప్రదాయమని ఇందులో భాగంగా పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు విన్నవించడం జరిగిందని బిర్రు ప్రతాప రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శులు సిద్ధం రాజారెడ్డి, సి.బి ఆదిత్య రెడ్డి, కర్నూల్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్నెం రజనీకాంత్ రెడ్డి, కర్నూలు జిల్లా యువజన అధ్యక్షులు ధార హరినాద్ రెడ్డి, యువజన విభాగం నాయకులు తిమ్మారెడ్డి, హరినాథ్ రెడ్డి లు పాల్గొన్నారు.

About Author