కర్నూలు.. తహశీల్దార్, వీఆర్వో సస్పెండ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలోని ఆలూరు తహసీల్దార్ హుశేన్ సాహెబ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. లేని భూమికి అడంగల్, పాసుపుస్తకాలు ఇచ్చిన తహసీల్దార్, మొలగవెళ్లి వీఆర్వో సూర్యుడును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు ఒక్కరోజు వ్యవధిలోనే స్పందించి.. తగు చర్యలు తీసుకున్నారు.