కర్నూలు.. వైసీపీ పై ఉపాధ్యాయుడి వినూత్న నిరసన
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా డోన్‌లోని ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డోన్ లోని కొత్తపేటలో నివాసం ఉంటున్న చిన్నపరెడ్డి అనే ఉపాధ్యాయుడు ‘సీపీఎస్ రద్దు చేసి గడపకు రండి’ అని పలకపై రాసి ఇంటి గేటుకు కట్టారు. గడప గడపకు వచ్చే వైసీపీ నేతలకు ముఖానే నిరసన తెలిపేలా టీచర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌గా చిన్నపరెడ్డి ఉన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.