దాసరి రంగమునికి కర్నూలు రంగస్థలం ఘన నివాళి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి మద్దూరు నగర్ పింగళి సూరన్న తెలుగుతోట నందు ఈరోజు ఉదయం 11 గంటలకు కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి హనుమంతరావు చౌదరి ఆధ్వర్యంలో కీర్తిశేషులు స్వర్గీయ కర్నూలు కళాకారుడు దాసరి రంగముని జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన సంస్కరణ సభలో దాసరి రంగముని చిత్రపటానికి పూలమాలలు వేసి కర్నూలు కళాకారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంస్మరణ సభా కార్యక్రమంలో కర్నూలు జిల్లా రంగస్థలం సీనియర్ నటులు జి అంకయ్య సయ్యద్ రోషన్ అలీ కళాప్రియ తిరుపాలు సిబి అజయ్ కుమార్ ఎం మనోహర్ బాబు బై లుప్పల షఫీయుల్లా అరుణకుమారి డిపార్వతయ్య స్వర్గీయ దాసరి రంగముని కర్నూలు జిల్లా కళాకారులకు చేసిన సేవలను కొనియాడారు. దాదాపు 40 సంవత్సరాలుగా కళామతల్లి సేవలో ఎందరో కళాకారులను తీర్చిన ఘనత దాసరి రంగమునీదే అని సభికులు తెలిపారు. కలకారుడిగా ఆధ్యాత్మిక వ్యక్తిగా దాసరి రంగముని జీవితం ధన్యమని డిఎన్వి సుబ్బయ్య డి పుల్లయ్య ఆనందరావు దాసరి రంగముని సేవలను గుర్తు చేశారు. రంగముని జ్ఞాపకార్థం సంస్కరణ సభ నిర్వహించడం చాలా ఆనందదాయకమని కళాకారులు కారణజన్ములని మరణాంతరం సైతం జీవించి ఉంటారని అలాంటి వారికి రంగస్థల కళాకారులకు చేయూతనందిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని నిర్వాహక కార్యదర్శి బైలుప్పల షఫీయుల్లా అన్నారు. దాసరి రంగముని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని కర్నూలు రంగస్థల కళాకారులు తెలిపారు. కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దాసరి రంగముని గారికి కందుకూరి విశిష్ట అవార్డు అందజేసిందని పి హనుమంతరావు చౌదరి తెలియజేశారు. దాసరి రంగమని దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం నాటకం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని కర్నూలు రంగస్థలం కళాకారులు గుర్తు చేసుకున్నారు. కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులకు రచయితలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ప్రధాన కార్యదర్శి పి హనుమంతరావు చౌదరి తారక రామారావు గారి పద్య రచన ఎన్టీఆర్ శతకం పద్యాలు త్వరలో పుస్తక రూపంలో ప్రచురిస్తామని కళాకారులకు సహకారం అందిస్తామని అన్నారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు దాసరి రంగముని అభిమానులు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.