కర్నూలు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికై… ప్రతిపాదనలు సిద్ధం చేయండి : సీఎం జగన్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా.సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి.శ్రీనివాసులు ఘన స్వాగతం, వీడ్కోలు పలికారు. అందులో భాగంగా కర్నూలు నగరంలో భవిష్యత్తులో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేయాలని కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి వినతిపత్రం అందజేయడంతో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు నగరానికి శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం వీలైనంత త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావును రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు.