కర్నూలు.. 30 ఏళ్ల తర్వాత తుంగభద్ర రికార్డు !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు నమోదు చేసింది. 30 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో మే నెలలోనే జలాశయంలో దాదాపు 34 టీఎంసీల నీటి నిల్వ నమోదు అయ్యింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 26,987 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 584 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 1608.95 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలకు గాను… జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ దాదాపు 34 టీఎంసీలకు చేరింది.