కర్నూలు వక్ఫ్‌బోర్డు భూములపై.. డిప్యూటీ సీఎం సమీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతానికి అడ్డుకట్ట వేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంగళవారం విజయవాడ డిప్యూటీ సీఎం అంజద్ బాషా క్యాంపు కార్యాలయం నందు వక్ఫ్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష మావేం జరిపారు. వక్ఫ్ భూములలో ఇది వరకు నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయడం మరియు గెజెట్ ని అప్ డేట్ చేయడం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ రెవెన్యూ, పోలీసు మరియు రిజిస్ర్టేషన్ అధికారుల సమన్వయంతో వక్ఫ్‌భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. ఈ రివ్యూ మీటింగులో వక్ఫ్ బోర్డు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అలీం బాషా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొనడమైనది.