కర్నూలును నిజమైన స్మార్ట్ సిటీ చేస్తా.. టిడిపి అభ్యర్థి టీజీ భరత్
1 min readబంగారుపేటలో టి.జి భరత్ భరోసా యాత్ర
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : నగరాన్ని నిజమైన స్మార్ట్ సిటీ చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 13వ వార్డు పరిధిలోని బంగారుపేట, విఠల్ నగర్ లో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి పార్టీ సూపర్ 6 పథకాల మేనిఫెస్టోతో పాటు ఆయన స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీల కరపత్రాలను అందించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రజలు స్థానికంగా ఉన్న ఇళ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సమస్యలు, విద్యుత్ సమస్యలను ఆయనతో మొరపెట్టుకున్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అన్ని సమస్యలే ఉన్నాయన్నారు. కర్నూలు నగరంలో ఏ వీధికి వెళ్లిన ప్రజలు ఏదో ఒక సమస్యను చెబుతూనే ఉన్నారని ఆయన చెప్పారు. నగరం మొత్తం పర్యటించి ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టోను తయారు చేసినట్లు భరత్ చెప్పారు. తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక ఈ 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నగరాన్ని నిజమైన స్మార్ట్ సిటీ తాను చేస్తానన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు శ్రీనివాస్ రెడ్డి, విఠల్ శెట్టి, సురేష్, సురేంద్ర, శివరాం, భాస్కర్, ఏలియా, శేఖర్, నవీన్, రవి, ఎల్లయ్య, షాషా, మధు, రేష్మ, నాగరాజు, బజారి, పురుషోత్తం, జనసేన కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.