కర్నూలు జడ్పీ చైర్మన్ రాజీనామా !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. వెంకటసుబ్బారెడ్డి కలెక్టర్ కోటేశ్వరావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించడం గమనార్హం. చైర్మన్ పదవి ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి మద్దతున్న కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డికి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డితో తక్షణమే రాజీనామా చేయించాలని జిల్లా నాయకులు పట్టుబట్టారు. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. దీంతో సంక్షోభం తలెత్తింది. పలువురు జడ్పీటీసీలు కూడ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.