కురుబ,కురుమల”ను ఎస్టీ జాబితాలో చేర్చాలి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: కురుబ కురుమలను ఎస్టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 3 ,4 తేదీల్లో ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని కురుబ కురుమల జేఏసీ నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జబ్బల శ్రీనివాస రావు మాట్లాడుతూ ,ఏప్రిల్ మూడవ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, నాలుగవ తేదీన మేధావులతో ఢిల్లీ ఆంధ్ర భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నమనజనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు కురుబరాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.కురుబ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరుతున్నామన్నారు. రాయలసీమ జిల్లాల్లో కురుబలు అత్యధికంగా ఉన్నారని, ఆయా నియోజకవర్గాల్లో కురుబ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏప్రిల్ నెలలో లక్ష మంది కురుబ సామాజిక వర్గ ప్రజలతో కుప్పంలో కురుబ మహా గర్జన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కురువ కురువ నాయకులు తదితరులుపాల్గొన్నారు.