కురువలు రాజకీయంగా ఎదగాలి
1 min readపల్లెవెలుగు వెబ్:కురువలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి. కర్నూలు జిల్లా మద్దికెర మండల కేంద్రంలో ఆదివారం జరిగిన శ్రీ భక్త కనకదాసు గారి 535 వ జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీనివాసులు, ఎం.కె.రంగస్వామితోపాటు సిపిఐ రాష్ట్ర నాయకులు కే .రామచంద్రయ్య ,పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ పక్కీరప్ప , మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే రంగస్వామి మాట్లాడుతూ కురువలు సామాజికంగా ,ఆర్థికంగా ,విద్యాపరంగా ,రాజకీయంగా మరియి రాజకీయంగా ఎదగాలని ,జిల్లాలో 6 ఓటర్లు కలిగిన కురువలకు అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి ఒక ఎంపీ ,రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని కోరారు .తదనంతరము నాయకులను సాళువ పూలమాలతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో కే .లక్ష్మీనారాయణ ,గడ్డం రామాంజనేయులు ,రక్షా హాస్పిటల్ అధినేత నాగరాజు ,గొర్రెల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ,బి .బాలరాజు, కే .ఎల్లయ్య ,బి .తరుణ్ ,బురుజుల పక్కీరప్ప ,తదితరులు పాల్గొన్నారు .