కురువ సంఘం కౌతాళం మండల కమిటీ ఎన్నిక వాయిదా..
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా కౌతాళం మండలం కురువ సంఘం ఎన్నికకు పోటీ తీవ్రంగా ఉండటంతో తాత్కాలికంగా కమిటీ ఎన్నికను వాయిదా వేసినట్లు ఎన్నికల పరిశీలకులు లక్ష్మన్న , గర్జప్ప, పరమేష్, బూదూరు లక్ష్మన్న ప్రకటించారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న భీరలింగేశ్వర స్వామి దేవాలయంనకు లక్ష రూపాయలు విరాళంగా కురువ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గర్జప్ప అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగస్వామి దివాకర్ బాలరాజు ఎంపీపీ అమరేష్ మండల నాయకులు వీరేష్ నర్సింహులు రమేష్ శివ నర్సింహులు కురువ కులస్థులు పాల్గొన్నారు.