కురువ లు ఏకతాటిపైకి రావాలి : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
1 min readపల్లె వెలుగు వెబ్ పత్తికొండ : మదాసి, మదారి కురువ ఎస్ సి కుల ధ్రువీకరణ పత్రాల సాధనకు కురవ లంతా ఏకతాటిపై కృషి చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపంలో మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కురువ మహాసభల్లో ముఖ్యఅతిథిగా ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కురువలగా పిలువబడుతున్న మాదాసి మదారి కురువ లు ఎస్సీ కులాల జాబితాలో చేర్చబడినది అని, కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా కురువ లకు కురుబ బిసి కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారని అన్నారు. ఈ కారణంగా కురువ లు అన్ని రకాలుగా వెనకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గజిట్ లో ఉన్న మాదాసి మదారి కురువ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించానని దీంతో ఆయన స్పందించి ఐఏఎస్ అధికారి తో విచారణ కమిషన్ వేశారని తెలిపారు. భవిష్యత్తులో ఈ కమిషన్ చేత నివేదిక తెప్పించుకొని కురువ లకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియకు పాటుపడతానని చెప్పారు. మాదాసి మదారి కురువ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం కురువలంతా కలిసికట్టుగా పోరాడితేనే ప్రభుత్వాలు దిగి వస్తాయి అని చెప్పారు. అందుకోసం కురువ లంతా ఐకమత్యంగా కలిసి పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గo చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సోమలింగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కే శివలింగం ప్రమాణ స్వీకారం చేశారు.