కురువలు అన్ని రంగాల్లో రాణించాలి…
1 min read– సమావేశంలో ప్రసంగిస్తున్న కర్నూలు జిల్లా కురువ సంఘము ఉపాధ్యక్షులు కత్తి శంకర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లేల్ల గ్రామంలో బుధవారంనాడు గంగమ్మ దేవాలయం ఆవరణంలో కురువ కులస్థుల ఆత్మీయ సమ్మేళనం మండల అధ్యక్షులు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కత్తి శంకర్, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,ప్రధాన కార్యదర్శిఎం .కే . రంగస్వామి మాట్లాడుతూ కురువ కులస్తులందరూ ఐక్యంగా ఉండాలని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రాజకీయంగా కూడా ఎదగాలని అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురవ సంఘం జిల్లా నాయకులు పెద్దపాడు ధనుంజయ ,నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు,కల్లూరు మండల కార్యదర్శి ఓ . పుల్లన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే . రంగస్వామి ,గోస్పాడు మండల అధ్యక్షులు వి నాగరాజు ,.యాళ్లూరు జిల్లెల్ల గ్రామాల కులస్థులు సాంబశివుడు నడిపి బాలయ్య ఓంకారమణారెడ్డి మల్లెల జమాలయ చిక్కిం శ్రీనివాస్ పాల్గొన్నారు.