కెవిపిఎస్ 2023 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల : కెవిపిఎస్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను మేజర్ గ్రామ సర్పంచ్ హైమావతి చంద్రశేఖర్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎపిఓ బుజ్జయ్య, ఏవో బాబు భాస్కర్ , మండల యూత్ అధ్యక్షులు బందే నవాజ్, మండల ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ,కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ మాట్లాడుతూ దళితుల బ్రతుకులు మెరుగుపరచుటకై అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కొనసాగించాలని, అలాగే నిధుల కేటాయించి పకడిబందిగా అమలు చేయాలని అన్నారు.నేటికీ దళితుల బ్రతుకులు నివసిస్తున్న కాలనీలు సమస్యలకు నిలయాలుగా ఉంటున్నాయి. నిరంతరం ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు దౌర్జన్యాలు గ్రామ బహిష్కరణలు కుల వివక్షకు గురవుతూనే ఉన్నారు.ప్రభుత్వం సంక్షేమ పథకాలను తిరిగి అమలుపరుస్తూ దళితులను విద్య పరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి పరచి ఆత్మగౌరవంగా జీవించే విధంగా బలపర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు మాదన్న ,డప్పు కళాకారుల సంఘం అధ్యక్షుడు మారేసు, మాజీ కార్యదర్శి దేవదాసు, కే జి బి ఎస్ మండల కార్యదర్శి మునిస్వామి నాయకులు స్వామి మల్లికార్జున దినకర్ జయరాజు రత్నమయ్య జయరాజు తదితరులు పాల్గొన్నారు.