బాంబు పేలుళ్లతో అట్టుడికిన కైవ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలను ముట్టడించాయి. రష్యా సైనిక దాడి ప్రారంభించినప్పటి నుంచి 2.5మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశం నుంచి పారిపోయారు. ఉక్రెయిన్‌లోని కైవ్ శివార్లలోని ఇర్పిన్‌లో రష్యా బాంబు దాడి తర్వాత ఒక ఫ్యాక్టరీ,దుకాణం దగ్ధమయ్యాయి. రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ రాజధాని నగరమైన కైవ్ కు సమీపంలో ఉన్నాయి. కైవ్ నగరంలో శనివారం రష్యా వేసిన బాంబు పేలుళ్లతో అట్టుడికింది. బాంబుపేలుళ్ల చప్పుళ్లతో కైవ్ నివాసితులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.