టీడీపీకి ఎల్. రమణ రాజీనామా
1 min read
పల్లెవెలుగు వెబ్: తెలుగుదేశం పార్టీకి, టీ. టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. రాష్ట్ర ప్రగతి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఎల్. రమణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతామని హామీ ఇవ్వడంతో ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించారు. మూడు , నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ఆయన తెలిపారు.