NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలులో ల్యాబ్ టెక్నిషియ‌న్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు రెడ్ క్రాస్ లో ల్యాబ్ టెక్నీషియన్ రామాంజనేయులు.. జిల్లా పంచాయతీ అధికారి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ‌త్నం చేశారు. ఇది గమనించిన జిల్లా పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు. రెడ్ క్రాస్ ఏవో, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లు తనను వేధింపులకు గురిచేస్తున్నారని రామాంజనేయలు ఆరోపించారు. అధికారుల ఒత్తిళ్ల‌తోనే త‌న జాబ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారనీ బాధితుడు రామాంజనేయులు వాపోయారు. గతంలో కూడా ఏవో అధికారి వేధింపుల వల్ల క‌ర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేష‌న్లో కేసు పెట్టాన‌ని, త‌ర్వాత రాజీ చేసి కేసు విత్ డ్రా చేయించార‌ని చెప్పారు. త‌ర్వాత త‌న‌ని మళ్ళీ వేధిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. తనకు ఇద్దరూ పిల్లలు ఉన్నారని, ఏ తప్పు చెయ్యకున్న తనను బలి చేసి త‌న కుటుంబాన్ని రోడ్డుపై పడేలా అధికారులు చేస్తున్నార‌ని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు న్యాయం చేసి ఉద్యోగం తిరిగి ఇప్పించేలా చేయాలని రామాంజినేయులు కోరారు.

                               

About Author